IGIA: ఢిల్లీని దట్టంగా కమ్మేసిన పొగమంచు... విమానాల రాకపోకలకు అంతరాయం!
- 10 మీటర్ల దూరం కూడా కనిపించకుండా పొగమంచు
- నాలుగు విమానాల దారిమళ్లింపు
- పలు విమానాల ఆలస్యం
ఈ ఉదయం దేశ రాజధానిని దట్టమైన పొగమంచు కమ్మేయగా, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పట్టుమని 10 మీటర్లయినా విజిబిలిటీ లేకపోవడంతో పదుల సంఖ్యలో విమానాలు రన్ వే ఎక్కకుండా, అనుమతి కోసం వేచి చూస్తున్నాయి. విదేశాల నుంచి వస్తున్న విమానాల ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వని అధికారులు, వాటిని ముంబై, అహ్మదాబాద్ లకు దారి మళ్లిస్తున్నారు.
హైదరాబాద్, బెంగళూరు, శ్రీనగర్ వెళ్లాల్సిన విమానాలు ఆలస్యంగా బయలుదేరుతాయని విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. పొగమంచు కారణంగా 4 విమానాలను దారి మళ్లించామని, పరిస్థితి మెరుగుపడిన తరువాత అవి తిరిగి న్యూఢిల్లీ చేరుతాయని అధికారులు వ్యాఖ్యానించారు.