Jana sena: విలీనానికి వచ్చే ఏ ప్రాంతీయ పార్టీనైనా మేము స్వాగతిస్తాం: బీజేపీ ఎంపీ జీవీఎల్
- అవసరమైతే ఈ విషయమై చొరవ తీసుకుంటా
- నా వంతు ప్రయత్నం చేస్తా
- అవసరం కోసం బీజేపీని వాడుకోవాలనుకుంటే కుదరదు
జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేస్తారన్న ప్రచారం నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతలు ఇప్పటికే స్పందించారు. తమతో మిత్రపక్షంగా ఉన్నా లేదా విలీనం చేసినా సంతోషమేనని బీజేపీ నేత రఘునాథబాబు నిన్న ప్రకటించారు. తాజాగా, బీజేపీ ఎంపీ జీవీఎల్ స్పందిస్తూ, బీజేపీ విధానాలు నచ్చి, తమతో ఏకీభవించి విలీనానికి వచ్చే ఏ ప్రాంతీయపార్టీని అయినా తాము స్వాగతిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయమై చొరవ తీసుకోవాల్సి వస్తే తప్పనిసరిగా తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. కేవలం, తమ అవసరం కోసం బీజేపీని వాడుకుని, రాజకీయ అస్త్రాన్ని సందిద్దామనుకుంటే కనుక అది గ్రహించలేని పరిస్థితిలో బీజేపీ లేదని అనుకోవద్దని స్పష్టం చేశారు.