rbi: జీడీపీ వృద్ధిరేటు అంచనాను కుదించిన ఆర్బీఐ
- జీడీపీ వృద్ధిరేటు అంచనా 6.1 నుంచి 5 శాతానికి తగ్గింపు
- 2020-21 తొలి అర్ధ భాగంలో ద్రవ్యోల్బణం 4.0 నుంచి 3.8 మధ్య
- వెల్లడించిన ఆర్బీఐ
జీడీపీ వృద్ధిరేటు అంచనాను భారతీయ రిజర్వు బ్యాంకు తగ్గించింది. అలాగే, పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను వెల్లడించింది. రెపోరేటు ప్రస్తుతం ఉన్న 5.15శాతం వద్దే కొనసాగనుంది. రివర్స్ రెపోరేటు 4.90శాతం వద్ద, బ్యాంక్ రేటు 5.40శాతం వద్ద కొనసాగుతాయని ప్రకటించింది. వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. గతంలో 6.1శాతంగా ఉన్న వృద్ధిరేటును 5 శాతానికి తగ్గించింది.
ద్రవ్యోల్బణం 2020-21 రెండో అర్ధ భాగానికి నిర్దేశిత లక్ష్యం కంటే తక్కువగానే ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ద్రవ్యోల్బణం 5.1 నుంచి 4.7 శాతంగా ఉండవచ్చని చెప్పింది. 2020-21 తొలి అర్ధ భాగంలో ఇది 4.0 నుంచి 3.8 మధ్య ఉంటుందని అంచనాలు వేసింది.