ESI: ఈఎస్ఐ స్కాం: డైరెక్టర్ దేవికారాణి భర్తను అరెస్ట్ చేసిన ఏసీబీ
- ఏసీబీ అధికారుల అదుపులో డాక్టర్ గురుమూర్తి
- భార్య దేవికారాణి తరఫున లంచాలు వసూలు చేసినట్టు గుర్తింపు
- లంచం సొమ్ముతో పలు ఆస్తుల కొనుగోలు
ఔషధాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడడం ద్వారా కోట్ల రూపాయలు నొక్కేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణి భర్తను కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. దేవికారాణి భర్త డాక్టర్ గురుమూర్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి హైదరాబాద్, కడప, తిరుపతిలో ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. రూ.100 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు నిర్ధారించారు.
18 ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్ విలువ రూ.15 కోట్లు కాగా, ఇప్పటి మార్కెట్ విలువ ప్రకారం ఆ ఆస్తుల విలువ 10 రెట్లు ఎక్కువ ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. గురుమూర్తి తన భార్య దేవికారాణి తరఫున లంచాలు వసూలు చేసి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఆస్తులు కొనుగోలు చేసేవాడని ప్రాథమిక విచారణలో తెలుసుకున్నారు.