India: భారత్-వెస్టిండీస్ సిరీస్ లో కొత్త నిబంధన అమలు

  • నోబాల్స్ విషయంలో ఐసీసీ కీలక నిర్ణయం
  • ఫ్రంట్ ఫుట్ నోబాల్స్ బాధ్యతలు థర్డ్ అంపైర్ కు అప్పగింత
  • త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా అమలు

నోబాల్స్ విషయంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రంట్ ఫుట్ నోబాల్స్ గుర్తించే బాధ్యతను ఇకపై థర్డ్ అంపైర్ కు ఇస్తున్నట్టు ప్రకటించిన ఐసీసీ, ఈ మేరకు భారత్-వెస్టిండీస్ టి20, వన్డే సిరీస్ ల్లో ప్రయోగాత్మకంగా ఈ నిబంధనను పరిశీలించాలని భావిస్తోంది.

కొత్త రూల్ ప్రకారం, ఫీల్డ్ లో ఉన్న అంపైర్ ఫ్రంట్ ఫుట్ నోబాల్ ను నేరుగా ప్రకటించరాదు. థర్డ్ అంపైర్ టెలివిజన్ ద్వారా ఫ్రంట్ ఫుట్ నోబాల్స్ గుర్తించి ఫీల్డ్ లో ఉన్న అంపైర్ కు సూచిస్తాడు. థర్డ్ అంపైర్ తో చర్చించాకే ఫీల్డ్ అంపైర్ నోబాల్ ప్రకటించాల్సి ఉంటుంది. అంతేకాదు, బ్యాట్స్ మన్ అవుటైనప్పుడు ఆ బంతి నోబాల్ అని థర్డ్ అంపైర్ గుర్తిస్తే, ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని వాపసు తీసుకోవాలి.

ఇటీవల కాలంలో నోబాల్స్ ను గుర్తించడంలో ఫీల్డ్ అంపైర్లు విఫలమవుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. క్రికెట్లో ఒక చిన్న పొరబాటు భారీ మూల్యానికి కారణమవుతోందన్న నేపథ్యంలో ఐసీపీ తాజా నిబంధనకు రూపకల్పన చేసింది. తొలుత భారత్-వెస్టిండీస్ సిరీస్ లో ఈ రూల్ ను పరీక్షించి, ఆపై ప్రపంచక్రికెట్లో ప్రవేశపెట్టాలని ఐసీసీ భావిస్తోంది.

  • Loading...

More Telugu News