Unnao: ఉన్నావో అత్యాచార బాధితురాలికి నిప్పుపెట్టిన ఘటనపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం

  • కోర్టుకు వెళుతున్న బాధితురాలికి నిప్పుపెట్టిన దుర్మార్గులు
  • తీవ్రంగా స్పందించిన కమిషన్
  • ఉత్తరప్రదేశ్ డీజీపీకి నోటీసులు

'దిశ' తరహా ఘటనలు ఎన్ని జరిగినా పరిస్థితుల్లో మాత్రం మార్పురావడంలేదు. గతేడాది యూపీలోని ఉన్నావోలో జరిగిన అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధితురాలిపై తాజాగా జరిగిన దాడి మరింత నివ్వెరపరుస్తోంది. విచారణ కోసం కోర్టుకు వెళుతున్న ఆమెకు కొందరు దుండగులు నిప్పంటించారు. 70 శాతం కాలినగాయాలతో బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

దీనిపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితురాలికి పోలీసులు భద్రత కల్పించలేకపోవడాన్ని కమిషన్ తప్పుబట్టింది. ఘటనపై తీవ్రస్థాయిలో స్పందించిన కమిషన్ ఉత్తరప్రదేశ్ డీజీపీకి నోటీసులు జారీచేసింది. ఘటనపై పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలని కోరింది. 'దిశ' ఘటన మరువకముందే ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని మహిళా కమిషన్ పేర్కొంది.

కొన్నాళ్ల కిందట ఉన్నావో బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఓ లారీ ఢీకొనగా ఆమె బంధువులిద్దరూ మరణించారు. ఉన్నావో బాధితురాలు, ఆమె లాయర్ తీవ్రగాయాలతో బతికి బయటపడ్డారు.

  • Loading...

More Telugu News