Janasena: ప్రకాశ్ రెడ్డికి ఎలాంటి హాని జరిగినా సహించం.. పవన్ కల్యాణ్ తల తీసేందుకు వెనుకాడం: ఏపీ రెడ్డి సంక్షేమ సంఘం నేతలు
- తలలు తీసేస్తానన్న జనసేన నేత సాకే పవన్
- ‘అనంత’లో ఏ ఒక్క రెడ్డికి హాని జరిగినా ఊరుకోం
- పవన్ కల్యాణ్ ఎముకలు విరిచేస్తాం
జనసేన నాయకుడు సాకే పనవ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. హింసా రాజకీయాలను జనసేన ప్రోత్సహిస్తోందని ఇప్పటికే వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా ఏపీ రెడ్డి సంక్షేమ సంఘం నేతలు స్పందించారు. రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డికి ఎలాంటి హాని జరిగినా సహించమని, పవన్ కల్యాణ్ తల తీసేందుకు కూడా వెనుకాడమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లాలో ఏ ఒక్క రెడ్డికి హాని జరిగినా పవన్ కల్యాణ్ ఎముకలు విరిచేస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.