health: బీపీని దూరం చేసుకోవాలంటే మానసికంగా ప్రశాంతంగా ఉండండి: పరిశోధకుల సూచన
- హృద్రోగాలు కూడా తగ్గుతాయి
- యోగా, విహార యాత్రలకు వెళ్లడం వంటివి చేయాలి
- స్మార్ట్ ఫోన్లు, టీవీలు చూసే సమయాన్ని కూడా తగ్గించుకోవాలి
మానసిక ప్రశాంతతతో బీపీని అదుపులో ఉంచవచ్చని పరిశోధకులు గుర్తించారు. ఒత్తిడిమయ జీవితం, గతి తప్పిన జీవన విధానం, నియంత్రణ లేని భావోద్వేగాలతో మనిషి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. వీటి వల్ల ఆరోగ్య సమస్యలూ తలెత్తుతున్నాయి.
బీపీ ఉన్నవారిపై ఆహారం, వ్యాయామంతో పాటు మానసిక స్థితి కూడా ప్రభావం చూపుతుందని తమ పరిశోధనల ఫలితంగా గుర్తించారు. మనసును ప్రశాంతంగా ఉంచితే బీపీ అదుపులో ఉండడమే కాకుండా హృద్రోగాలు కూడా తగ్గుతాయని తెలిపారు. ఇందుకోసం యోగా, విహార యాత్రలకు వెళ్లడం వంటివి చేయాలని పరిశోధకులు చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్లు, టీవీలు చూసే సమయాన్ని కూడా తగ్గించుకుంటే మంచిదని సూచిస్తున్నారు.