Lover: ఆత్మహత్యాయత్నం చేసిన ప్రియురాలు... ఐసీయూలో తాళి కట్టిన ప్రియుడు

  • మోసపూరిత మాటలతో లోబరచుకున్న యువకుడు
  • ఆపై పెళ్లికి మొహం చాటేయడంతో ఆత్మహత్యాయత్నం
  • బంధువులు కల్పించుకోవడంతో పెళ్లికి అంగీకారం

తనను ప్రేమిస్తున్నానని చెప్పి, మోసపూరిత మాటలతో లోబరచుకుని, ఆపై పెళ్లికి నిరాకరిస్తున్నాడన్న మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేయగా, బంధువులు కల్పించుకోవడంతో దిగివచ్చిన ప్రియుడు తాళి కట్టాడు. ఆమె చికిత్స పొందుతున్న ఐసీయూనే పెళ్లి వేదికైంది.

ఈ ఘటన పూణెలో జరిగింది. నగరానికి చెందిన సూరజ్ అనే యువకుడు, ఓ యువతి ప్రేమించుకున్నారు. ఆపై పెళ్లాడేందుకు సూరజ్ నిరాకరించడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. విషయాన్ని పసిగట్టిన బంధువులు అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించారు. సూరజ్ కు దేహశుద్ధి చేసి, ఆసుపత్రికి తరలించారు. ఆపై ఐసీయూలోనే ఆ జంట ఒకటైంది.

  • Loading...

More Telugu News