Disha: లారీకి స్కూటీ అడ్డం రావడంతో 'దిశ' చనిపోయిందని నా కుమారుడు చెప్పాడు: ఆరిఫ్ తల్లిదండ్రులు
- బయటకు వెళ్లినప్పుడు మా కుమారుడు తాగుతాడు
- ఒకే ఒక్క కొడుకు
- ఆరిఫ్ మాకు పుట్టలేదనే అనుకుంటాం
దిశపై హత్యాచారానికి పాల్పడ్డ నిందితుల్లో ఒకరైన ఆరిఫ్ తల్లిదండ్రులు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలు తెలిపారు. హత్యాచారం జరిగిన రోజు రాత్రి 12 గంటలకు తమ కుమారుడు ఇంటికి వచ్చాడని, తెల్లవారు జామున 3 గంటలకు పోలీసులు వచ్చి అతడిని తీసుకెళ్లారని చెప్పారు. తన కుమారుడు భయపడుతూ ఇంటికి వచ్చాడని చెప్పారు.
లారీలో వస్తోంటే స్కూటీ అడ్డం వచ్చిందని, ఓ అమ్మాయికి తాకిందని ఆమె చనిపోయిందని చెప్పాడని వెల్లడించారు. ఇంటికి ఐదు రోజులకొకసారి వస్తాడని చెప్పారు. తమ ముందు ఏమీ తాగడని, బయటకు వెళ్లినప్పుడు తాగుతాడని అన్నారు. ఆరిఫ్ తమకు పుట్టలేదనే అనుకుంటామని అన్నారు. ఇటువంటి ఘటన భవిష్యత్తులో ఎవ్వరికీ జరగొద్దని అన్నారు. తమకు ఒకే ఒక్క కుమారుడు ఉన్నాడని చెప్పారు. మూడేళ్ల నుంచి అతడు లారీ నడుపుతున్నాడని చెప్పారు.