President Of India: రేపిస్టులపై దయ చూపాల్సిన అవసరం లేదు: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
- మహిళల భద్రత అనేది చాలా ముఖ్యమైన విషయం
- అత్యాచార దోషులకు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశం ఉండొద్దు
- క్షమాభిక్ష పిటిషన్లపై పార్లమెంట్ పున:సమీక్షించాలి
రాజస్థాన్ లో నిర్వహించిన మహిళా సామాజిక సాధికారత సదస్సులో పాల్గొన్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేపిస్టులపై దయ చూపాల్సిన అవసరం లేదని అన్నారు. మహిళల భద్రత అనేది చాలా ముఖ్యమైన విషయమని, అత్యాచార కేసుల్లో దోషులకు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశం కూడా ఉండొద్దని అన్నారు.
పోక్సో చట్టం కింద అత్యాచార నిందితులుగా నిర్ధారించబడిన వారికి క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసే అర్హత లేదని, క్షమాభిక్ష పిటిషన్లపై పార్లమెంట్ పున:సమీక్షించాలని సూచించారు. ఇదిలా ఉండగా, నిర్భయ నిందితుడి క్షమాభిక్ష పిటిషన్ ఫైల్ ను రాష్ట్రపతికి కేంద్ర హోం శాఖ పంపింది. ఈ పిటిషన్ ను తిరస్కరించాలని రాష్ట్రపతికి హోంశాఖ సూచించినట్టు సమాచారం.