brain: మెదడుకు ఆక్సిజన్ చక్కగా అందాలంటే వ్యాయామం చేయండి.. పరిశోధకుల సూచన
- గుర్తించిన అమెరికాలోని పెన్ న్యూరోసైన్స్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు
- ఎలుకలపై పరిశోధన
- వ్యాయామంతో శరీరంలో రక్త ప్రసరణ రేటు పెరుగుదల
వ్యాయామం మనిషిని ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండేటట్లు చేస్తుంది. ఇప్పటికే ఎన్నో పరిశోధనల్లో ఈ విషయం తేలింది. వ్యాయామం వల్ల మెదకుడు కలిగే ప్రయోజనాలపై పరిశోధకులు మరో విషయాన్ని గుర్తించారు. మెదడుకు ఆక్సిజన్ చక్కగా అందితే చురుకుదనం పెరుగుతుంది. ఇందుకోసం వ్యాయామం ఎంతగానో ఉపయోగపడుతుందని అమెరికాలోని పెన్ న్యూరోసైన్స్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు గుర్తించారు. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో ఈ విషయం తెలిసిందని వివరించారు.
వ్యాయామంతో శరీరంలో రక్త ప్రసరణ, నాడీకణాల చర్యల రేటు పెరుగుతుందని, దీంతో రక్తం ద్వారా ఎలుకల మెదడుకు అందే ఆక్సిజన్ మోతాదు గణనీయంగా పెరిగిందని తెలిపారు. మెదడుకు ఆక్సిజన్ లభ్యత పెరగాలంటే వ్యాయామం చేయాలని పరిశోధకులు సూచిస్తున్నారు.