PV Sindhu: ‘లేక్ వ్యూ’ ఓఎస్డీగా పి.వి. సింధు: ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
- సీసీఎల్ఏలో డిప్యూటీ కలెక్టర్ గా శిక్షణ పూర్తి చేసుకున్న సింధు
- టోక్యో ఒలింపిక్స్ కోసం 2020 ఆగస్ట్ వరకూ ఆన్ డ్యూటీ లీవ్
- ఇటీవల అమరావతిలో సీఎం జగన్ తో భేటీ
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధును ఏపీ ప్రభుత్వ అధీనంలో ఉన్న హైదరాబాద్ లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఓఎస్డీగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సింధు రెవెన్యూ శాఖలోని సీసీఎల్ఏలో డిప్యూటీ కలెక్టర్ గా ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకున్నారు.
ఈ పోస్ట్ ను ఆమెకు కేటాయించడానికి ప్రొటోకాల్ విభాగంలోని సహాయ డైరెక్టర్ హోదాను పెంచింది ప్రభుత్వం. చార్జ్ తీసుకున్న అనంతరం ఆమె 2020 ఆగస్ట్ నెల వరకూ ఆన్ డ్యూటీ లీవ్ లో ఉంటారు. ఈ సమయంలో ఆమె టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ కు సిద్ధం కావటానికి వెళతారు. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని అమరావతిలోని ఆయన నివాసంలో కలిసిన పి.వి. సింధు, ఆన్ డ్యూటీ లీవ్ పర్మిషన్ కు ఆమోదం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.