Tirumala: తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ

  • 20 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
  • దర్శనానికి 8 గంటలకు పైగా సమయం
  • నిన్న హుండీ ఆదాయం రూ. 2.52 కోట్లు

వారాంతం కావడంతో శుక్రవారం సాయంత్రం నుంచి తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో, ఈ ఉదయం స్వామి దర్శనం కోసం దాదాపు 35 వేల మందికి పైగా భక్తులు కంపార్టుమెంట్లలో వేచి చూస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 20 కంపార్టుమెంట్లు సర్వదర్శనం నిమిత్తం వచ్చిన భక్తులతో నిండిపోయివుంది.

వీరికి స్వామి దర్శనానికి కనీసం 8 గంటలకు పైగా సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. దివ్య దర్శనం, ప్రత్యేక దర్శనం, టైమ్ స్లాట్ టోకెన్ లను కలిగివున్న వారికి 3 గంటల్లో స్వామి దర్శనం పూర్తవుతుందని తెలిపారు. శనివారం నాడు స్వామివారిని 84,042 మంది భక్తులు దర్శించుకున్నారని, శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.52 కోట్ల రూపాయలని వెల్లడించారు.

  • Loading...

More Telugu News