Paderu: తనకన్నా ఐదేళ్ల చిన్నవాడిని పెళ్లాడిన వితంతువు... అతనూ దుర్మార్గుడేనని ఫిర్యాదు!

  • పాడేరులో వెలుగులోకి వచ్చిన ఘటన
  • ప్రేమించానని చెబితే, అండగా నిలుస్తాడని నమ్మిన యువతి
  • టీచర్ల గ్రూపులో అశ్లీల దృశ్యాలు
  • నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
ప్రేమించానని వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని ప్రాధేయపడ్డాడు. అప్పటికే భర్త చనిపోయి, ఇద్దరు బిడ్డల తల్లిగా ఉండి, టీచర్ గా పనిచేస్తూ, కాలం వెళ్లదీస్తున్న ఆమె, తన జీవితంలో కొత్త వెలుగులు వస్తాయని నమ్మింది. తనకు అండగా ఉంటాడన్న ఉద్దేశంతో, అతను ఐదేళ్లు చిన్నవాడైనా పెళ్లాడింది. ఆపై తన వ్యక్తిగత వీడియోలు, టీచర్ల గ్రూప్ లో కనిపించడంతో, ఆ పని చేసింది భర్తేనని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించింది.

పాడేరులో వెలుగులోకి వచ్చిన కేసుకు సంబంధించి పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, పాడేరులో టీచర్ గా పనిచేస్తున్న  యువతి (26)కి అచ్యుతరావు (21) అనే యువకుడు పరిచయం అయ్యారు. పెళ్లి చేసుకుంటానని అతను చెప్పడంతో, ఈ సంవత్సరం మార్చిలో అన్నవరంలో వివాహం చేసుకున్నారు.

 ఆపై నెలల వ్యవధిలోనే ఇద్దరి మధ్యా గొడవలు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో ఆమె అసభ్యకర చిత్రాలను, వీడియోలను రహస్యంగా సేకరించిన అచ్యుతరావు, రెండు రోజుల క్రితం దాదాపు 250 మంది టీచర్లు సభ్యులుగా ఉన్న గ్రూపులో వాటిని పోస్ట్ చేశాడు. దీంతో తీవ్ర అవమానానికి గురైన ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు, అచ్యుతరావును అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.
Paderu
Teacher
Marriage
Widow
Police
Arrest
Social Media

More Telugu News