Hyderabad Business school: మాజీ ఎంపీ కవితకు ప్రతిష్టాత్మక ఆహ్వానం
- హైదరాబాద్ లోని ఇండియన్ బిజినెస్ స్కూల్ నుంచి కవితకు ఆహ్వానం
- 2020 జనవరి 9,10 తేదీల్లో జరగనున్న సదస్సు
- ‘మనీ పవర్ ఇన్ పాలిటిక్స్’పై ప్రసంగించనున్న కవిత
టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ కవితకు ప్రతిష్టాత్మక ఆహ్వానం అందింది. వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించే సదస్సులో పాల్గొనాలని కోరుతూ హైదరాబాద్ లోని ఇండియన్ బిజినెస్ స్కూల్ ఆమెకు ఆహ్వానం పంపింది. ఈ ఆహ్వానం మేరకు 2020 జనవరి 9,10 తేదీల్లో ‘ఇండియన్ డెమొక్రసీ ఎట్ వర్క్’ సదస్సులో ‘మనీ పవర్ ఇన్ పాలిటిక్స్’ అనే అంశంపై ఆమె ప్రసంగించనున్నారు. ఈ సదస్సుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, జాతీయ ఎన్నికల అధికారి అశోక్ లావస, జస్టిస్ చలమేశ్వర్ హాజరుకానున్నారు.