JIO: పోటీదారులతో పోల్చితే మా ప్లాన్లే చౌకగా ఉన్నాయి: జియో

  • కాల్ చార్జీలు పెంచిన మొబైల్ ఆపరేటర్లు
  • ఆల్ ఇన్ వన్ ప్లాన్లతో వచ్చిన జియో
  • ఐదు రెట్లు ఎక్కువ సదుపాయాలు కల్పిస్తున్నామన్న జియో

దేశంలో మరోసారి మొబైల్ కాల్ రేట్ల పోటీకి తెరలేచింది. జియో సహా ప్రధాన టెలికాం ఆపరేటర్లు కాల్ చార్జీలు పెంచేశారు. అందుకు అనుగుణంగా కొత్త ప్లాను తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో జియో వర్గాలు స్పందించాయి. ప్రత్యర్థి సంస్థలతో పోల్చితే తమ ప్లాన్లు ఎంతో చవక అని, తమ ప్లాన్లతో సాధారణ వినియోగదారుడు ఐదు రెట్లు ఎక్కువగా సదుపాయాలు అందుకుంటాడని, ఇందుకు అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని జియో పేర్కొంది. ట్రాయ్ ఐయూసీ చార్జి కారణంగా మొబైల్ ఆపరేటర్లు కాల్ చార్జీలు పెంచిన సంగతి తెలిసిందే.

అయితే ప్రత్యర్థులతో పోటీని దృష్టిలో పెట్టుకుని ఎయిర్ టెల్, వొడాఫోన్ అవుట్ గోయింగ్ కాల్స్ పై పరిమితిని ఎత్తివేశాయి. అయితే జియో మాత్రం తమ ఆల్ ఇన్ వన్ ప్లాన్లలో 28 రోజుల ప్లాన్ కు 1000 నిమిషాలు, 84 రోజుల ప్లాన్ కు 3000 నిమిషాలు మాత్రమే ఇతర నెట్ వర్క్ లకు అవుట్ గోయింగ్ సదుపాయం కల్పిస్తోంది. జియో నుంచి జియోకు మాత్రం అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు.

  • Loading...

More Telugu News