KTR: మరో అరుదైన ఫొటో పోస్టు చేసిన కేటీఆర్

  • నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే కేటీఆర్
  • సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్  
  • తాతయ్య ఫొటోతో ట్వీట్
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉంటారు. నిత్యం ట్విట్టర్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండడమే కాదు, అరుదైన ఫొటోలు షేర్ చేస్తుంటారు. తాజాగా, తన తాతయ్య (అమ్మ తరఫు) ఫొటో పోస్టు చేశారు. "ఈ ఫొటో చూశారా... మా తాతయ్య స్వర్గీయ జె.కేశవరావు గారు. ఆయనో స్వాతంత్ర్య సమరయోధుడు. అనేక పర్యాయాలు జైలుకెళ్లొచ్చారు. ఆయన పట్ల నేనెంతో గర్విస్తుంటాను" అంటూ తన అభిప్రాయాలను పంచుకున్నారు.
KTR
Telangana
TRS
Twitter
Social Media

More Telugu News