Andhra Pradesh: ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు... పీపీఏలపై సభలో రగడ
- ప్రశ్నోత్తరాలను చేపట్టిన స్పీకర్
- పీపీఏలపై ఏం చేశారని ప్రశ్నించిన టీడీపీ
- బాబు హయాంలో డిస్కంలను ముంచేశారన్న ప్రభుత్వం
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను స్పీకర్ తమ్మినేని సీతారాం చేపట్టారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించిన పీపీఏలపై సభలో అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
ప్రభుత్వ తీరు వల్ల రాష్ట్రం విద్యుత్ సమస్యతో అల్లాడుతోందని టీడీపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. పీపీఏలపై గత 6 నెలల్లో ఏం చేశారని ప్రశ్నించారు. పీపీఏలపై కమిటీ వేసి గందరగోళాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ పరిస్థితికి గత టీడీపీ ప్రభుత్వమే కారణమని మంత్రి బుగ్గన అన్నారు. గత ప్రభుత్వం డిస్కంలను ముంచేసిందని ఆరోపించారు. గత ప్రభుత్వ తప్పులను ప్రజలు సమర్థించాలా? అని ప్రశ్నించారు. బాబు హయాంలో డిస్కంలకు రూ. 2 వేల కోట్ల నష్టం వాటిల్లిందని అన్నారు. అన్నిటినీ పరిశీలించి సరైన సమయంలో ప్రభుత్వం నివేదిక ఇస్తుందని చెప్పారు.