Karnataka: కర్ణాటక ఉప ఎన్నికల్లో ఊహించిన ఫలితాలే వచ్చాయి: కేంద్ర మంత్రి సదానంద గౌడ
- ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సదానంద గౌడ
- కర్ణాటక ప్రజలకు సుస్థిర ప్రభుత్వం కావాలి
- గత సంకీర్ణ ప్రభుత్వంలో కర్ణాటకలో సుపరిపాలన, అభివృద్ధి దూరమయ్యాయి
కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో 11 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ.. మరో స్థానంలో విజయం దిశగా దూసుకెళ్తోంది. దీనిపై కేంద్ర మంత్రి సదానంద గౌడ స్పందించారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... 'ఊహించిన ఫలితాలే వచ్చాయి. కర్ణాటక ప్రజలకు సుస్థిర ప్రభుత్వం కావాలి. గత జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో కర్ణాటకలో సుపరిపాలన, అభివృద్ధి దూరమయ్యాయి' అని ఆయన చెప్పారు.
కాగా, 15 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఒక స్థానంలో గెలిచి, మరో స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. జేడీఎస్ కు ఒక స్థానం కూడా దక్కలేదు.