Asaduddin Owaisi: ఇలాంటి చట్టాల నుంచి దేశాన్ని కాపాడండి స్పీకర్!: లోక్ సభలో అసదుద్దీన్ ఒవైసీ

  • పౌరసత్వ సవరణ బిల్లుపై లోక్ సభలో చర్చ
  • అమిత్ షాపై ఒవైసీ తీవ్ర విమర్శలు
  • దీని నుంచి అమిత్ షాను కూడా కాపాడాలి
  • లేకపోతే ఆయన హిట్లర్, డేవిడ్ బెన్ గురియన్ ల సరసన చేరుతారు

పౌరసత్వ సవరణ బిల్లుపై లోక్ సభలో చర్చ కొనసాగుతోంది. దీనిపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. కేంద్రమంత్రి అమిత్ షాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 'ఇటువంటి చట్టం నుంచి దేశాన్ని కాపాడాలని నేను స్పీకర్ ను కోరుతున్నాను. అలాగే, దీని నుంచి అమిత్ షాను కూడా కాపాడాలి.. లేకపోతే ఆయన హిట్లర్, డేవిడ్ బెన్ గురియన్ ల వంటి నేతల సరసన చేరుతారు' అని వ్యాఖ్యానించారు. జర్మనీ నురేమ్బెర్గ్ చట్టం, ఇజ్రాయల్ పౌరసత్వ చట్టం వంటివి మనకు వద్దంటూ ఆయన వ్యాఖ్యానించారు.

పౌరసత్వ సవరణ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్లు అసదుద్దీన్ తెలిపారు. ఆయన వ్యాఖ్యలపై లోక్ సభలో గందరగోళం చెలరేగింది. ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు  స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. దేశంలోకి అక్రమ వలసలను నిరోధించేందుకే పౌరసత్వ సవరణ బిల్లును తీసుకొస్తున్నట్లు అమిత్ షా చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, పాక్ ల నుంచి భారత్ లోకి అక్రమ వలసలు కొనసాగుతున్నాయని అన్నారు.

  • Loading...

More Telugu News