Amit Shah: కేంద్రం ప్రతిపాదించిన పౌరసత్వ సవరణ బిల్లుకు వైసీపీ మద్దతు
- లోక్ సభలో బిల్లుపై చర్చ కోసం ఓటింగ్
- అనుకూలంగా 293 ఓట్లు
- బిల్లుతో మైనారిటీలకు న్యాయం జరుగుతుందన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి
దశాబ్దాల నాటి పౌరసత్వ చట్టానికి మార్పులు, చేర్పులు చేస్తూ కేంద్రం ప్రతిపాదించిన సవరణ బిల్లుకు వైసీపీ మద్దతు తెలిపింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ, ఈ బిల్లుతో మైనారిటీలకు న్యాయం జరుగుతుందని అన్నారు. శరణార్థులను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. కాగా, లోక్ సభలో బిల్లుపై చర్చ కోసం ఓటింగ్ నిర్వహించగా 293 మంది అనుకూలంగా ఓటేశారు. 83 మంది వ్యతిరేకిస్తూ ఓటేశారు. సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, పౌరసత్వ చట్టసవరణ బిల్లును ప్రజలు ఆమోదించారని తెలిపారు. శరణార్థులకు కూడా పౌరసత్వం కల్పించే ఉద్దేశంతోనే బిల్లు తీసుకువస్తున్నామని, ఇందులో ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేవని స్పష్టం చేశారు.