onion: అసెంబ్లీ సమావేశాలకు ముందు చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. నేతలకు పలు సూచనలు
- ప్రభుత్వానిది ఫాస్టిస్ ధోరణి
- ప్రశ్నించకూడదని మీడియా గొంతు నొక్కుతోంది
- ఉల్లిని డోర్ డెలివరీ చేయాలి
రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి ముందు ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై జగన్కు పట్టింపు లేదని ఆరోపించారు. టీడీపీని అణచివేయడంపైనే వైసీపీ దృష్టిపెట్టిందన్నారు.
తన చర్యలను ఎవరూ ప్రశ్నించకుండా ఉండాలనే ఫాసిస్ట్ ధోరణిని ప్రభుత్వం అవలంబిస్తోందని, అందులో భాగంగానే మీడియా గొంతు నొక్కుతోందని ఆరోపించారు. ఉల్లి ధరల పెరుగుదలపై నిన్న అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశామన్న బాబు.. ఉల్లి కోసం వెళ్తే ఉసురు తీయడం దారుణమన్నారు. వలంటీర్లతో ఇంటింటికి ఉల్లిపాయలను డోర్ డెలిరీ చేయించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.