Disha: 'దిశ' కేసులో జాతీయ మానవ హక్కుల సంఘానికి పోలీసుల నివేదిక
- కీలకమైన ఆధారాలను సమర్పించిన పోలీసులు
- ఎన్‌కౌంటర్‌పై సిట్ బృందం విచారణ
- రాచకొండ సీపీ మహేశ్ భగవత్ నేతృత్వంలో క్షేత్రస్థాయిలో దర్యాప్తు
హైదరాబాద్ శివారులోని శంషాబాద్ కు చెందిన వెటర్నరీ వైద్యురాలు దిశపై కొందరు మృగాళ్లు హత్యాచారానికి పాల్పడ్డ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘానికి హైదరాబాద్ పోలీసులు నివేదిక అందించారు. దిశ అపహరణ, అత్యాచారం, మృతదేహం కాల్చివేత వివరాలను నివేదికలో తెలిపారు. ఈ కేసులో కీలకమైన ఆధారాలను ఎన్‌హెచ్చ్‌ఆర్సీకి అందజేసిన నివేదికలో పొందుపర్చినట్లు తెలుస్తోంది.
అలాగే, ఇదే కేసులో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ లో కాల్చిచంపిన విషయం తెలిసిందే. వారు పారిపోయేందుకు ప్రయత్నించడంతోనే తాము కాల్పులు జరిపామని వారు అంటున్నారు. అయితే, దీనిపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్‌కౌంటర్‌పై సిట్ బృందం విచారణ జరుపుతోంది. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ నేతృత్వంలో క్షేత్రస్థాయిలో సిట్ సభ్యుల బృందం దర్యాప్తు ప్రారంభించింది.