Sensex: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 247 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 76 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 10 శాతానికి పైగా నష్టపోయిన యస్ బ్యాంక్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన కాసేపటికే సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ట్రేడింగ్ ముగిసేంత వరకు నష్టాల్లోనే కొనసాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 247 పాయింట్లు పతనమై 40,239కి పడిపోయింది. నిఫ్టీ 76 పాయింట్లు కోల్పోయి 11,861 వద్ద స్థిరపడింది. ఈ రోజు అన్ని సూచీలు నష్టాలనే నమోదు చేయడం గమనార్హం.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (1.15%), భారతి ఎయిర్ టెల్ (1.09%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.05%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.59%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.57%).
టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-10.32%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-2.58%), ఐటీసీ (-2.55%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.55%), హీరో మోటో కార్ప్ (-2.45%).