Telangana: కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన గవర్నర్ తమిళిసై

  • కన్నెపల్లి పంపుహౌస్, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల పరిశీలన
  • ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు
  • తక్కువ సమయంలో అద్భుత నిర్మాణం చేశారని ఇంజనీర్లకు ప్రశంస
తెలంగాణ గవర్నర్ తమిళిసై ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా  కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని గవర్నర్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పర్యటనలో భాగంగా కన్నెపల్లి పంపుహౌస్, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను గవర్నర్ పరిశీలించారు. కన్నెపల్లి పంపుహౌస్ వద్ద గోదావరి జలాల ఎత్తిపోతలు జరిగే విధానం, ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ.. తక్కువ సమయంలో అద్భుత నిర్మాణం చేశారని ప్రాజెక్టు ఇంజినీర్లను ప్రశంసించారు. తర్వాత మేడిగడ్డ బ్యారేజీకి వెళ్లి అక్కడి పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అన్నారం బ్యారేజీని పరిశీలించారు. కాళేశ్వరం పర్యటన ముగించుకున్న అనంతరం గవర్నర్ పెద్దపల్లి జిల్లాకు బయల్దేరి వెళ్లారు.
Telangana
govenor Tamilisy visit to kaleshwaram project

More Telugu News