Disha: 'దిశ' ఎన్ కౌంటర్ పై సుప్రీం ఆదేశాలు: మీడియా, సామాజిక మాధ్యమాలపై కట్టడి.. ఇతర దర్యాప్తులపై స్టే
- సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు
- ఎన్ కౌంటర్ పై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దర్యాప్తు
- తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఇతర విచారణలు జరపొద్దని ఆదేశం
'దిశ' నిందితుల ఎన్ కౌంటర్ పై అభ్యంతరాలు తెలుపుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై వాదనలు ముగిసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ కమిషన్ ను ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు పలు కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ కేసులో మీడియా, సామాజిక మధ్యమాలపై కట్టడి విధించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తుది తీర్పు వచ్చే వరకు మీడియా నియంత్రణ పాటించాలని చెప్పింది.
అలాగే, ఎన్ కౌంటర్ పై జరుగుతున్న ఇతర దర్యాప్తులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఇతర విచారణలు జరపొద్దని ఆదేశించింది. తాము ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ సభ్యుల భద్రత, విచారణకు కార్యాలయం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కమిషన్ సభ్యుల భద్రతను సీఆర్పీఎఫ్ కు అప్పగించింది.
కాగా, ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఈ రోజు సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి తెలిపారు.