Yadadri: హాజీపూర్ ఘటన కేసులో త్వరలో వెలువడనున్న తీర్పు?

  • ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఇరవై రోజులుగా విచారణ 
  • ఈ నెల 20 లేదా 30 తేదీల్లో తీర్పు వెలువడే అవకాశాలు
  • హాజీపూర్ ఘటనలో నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డి

హాజీపూర్ ఘటన కేసుపై విచారణ త్వరలో ముగియనున్నట్టు తెలుస్తోంది. నల్గొండ న్యాయస్థానంలో ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసుకు సంబంధించి ఇరవై రోజుల నుంచి నడుస్తున్న ట్రయల్స్ ముగిసినట్టు తెలుస్తోంది. ఈ నెల 20 లేదా 30 తేదీల్లో ఈ కేసుపై తీర్పు వెలువడే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఈ కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డి రిమాండ్ ఖైదీగా వరంగల్ జైలు లో ఉన్నాడు. మొత్తం నాలుగు హత్యల్లో శ్రీనివాస్ రెడ్డి ప్రధాన నిందితుడు.

కాగా, యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని హాజీపూర్ లో ముగ్గురు బాలికలు శ్రావణి, కల్పన, మనీషాపై అత్యాచారం చేసి వారిని హతమార్చాడు. అంతేకాకుండా, మరో మహిళ హత్య కేసులో కూడా శ్రీనివాస్ రెడ్డి నిందితుడు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని హాజీపూర్ గ్రామస్థులతో పాటు మృతుల కుటుంబాలకు చెందిన వ్యక్తులు డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News