Jagan: అవినీతి కేసుల వల్లే ప్రత్యేక హోదాను పక్కన పెట్టేశారు: కనకమేడల

  • రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా వైసీపీ వ్యవహరిస్తోంది
  • పోలవరం నిధులపై పార్లమెంటులో వైసీపీ మాట్లాడటం లేదు
  • దిశ చట్టం మాదిరే.. ఆర్థిక నేరాలపై ప్రత్యేక చట్టం తీసుకురావాలి

రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని ముఖ్యమంత్రి జగన్ పక్కన పెట్టేశారని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. అవినీతి కేసులే దీనికి కారణమని అన్నారు. దిశ చట్టం మాదిరే ఆర్థిక నేరాలపై ప్రత్యేక చట్టం తీసుకొచ్చి... జగన్, విజయసాయిరెడ్డిలు తాము అవినీతిరహిత వ్యక్తులమని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఈ ఆరు నెలల్లో ఏపీకి తీరని నష్టం వాటిల్లిందని అన్నారు. రాష్ట్రంలో రివర్స్ పరిపాలన కొనసాగుతోందని విమర్శించారు. పరిశ్రమలన్నీ రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నాయని చెప్పారు.

పార్లమెంటు, అసెంబ్లీలో ఆర్థిక నేరాలపై ప్రస్తావనే ఉండటం లేదని కనకమేడల చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరగడం లేదని విమర్శించారు. రాష్ట్ర సమస్యలను వైసీపీ ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావించడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా వైసీపీ వ్యవహరిస్తోందని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులను ఇవ్వాలని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని తాము కోరామని... వైసీపీ ఎంపీలు మాత్రం దీనిపై మాట్లాడటం లేదని దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News