Amazon: వినియోగదారులకు డెలివరీపై కీలక నిర్ణయం తీసుకున్న అమెజాన్

  • తన ఆర్డర్లకు తానే డెలివరీ ఇవ్వాలనుకుంటున్న అమెజాన్
  • నగరాల్లో సొంత కొరియర్ వ్యవస్థ
  • గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఇతర కొరియర్ సంస్థల సేవలు

ప్రముఖ ఈ-కామర్స్ వేదిక అమెజాన్ ఇప్పటివరకు వస్తువుల డెలివరీ కోసం కొరియర్ సంస్థల నుంచి సేవలు అందుకునేది. అయితే, ఇకమీదట తన ఆర్డర్లను తానే డెలివరీ ఇవ్వాలని అమెజాన్ నిర్ణయించుకుంది. సగానికి సగం నగర ప్రాంతాల్లో స్వంత కొరియర్ విభాగం ఏర్పాటు చేసుకుని వినియోగదారుల వద్దకు వస్తువులు చేర్చాలని భావిస్తోంది.

ఇప్పటికే అమెజాన్ ఆధ్వర్యంలో అమెజాన్ లాజిస్టిక్స్ రవాణా విభాగం పనిచేస్తోంది. తాజా నిర్ణయంతో త్వరలోనే అమెజాన్ లాజిస్టిక్స్ పేరుమోసిన కొరియర్ సంస్థలను వెనక్కినెట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో అమెజాన్ ఇతర కొరియర్ సంస్థలపైనే ఆధారపడనుంది. దీనిపై యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

  • Loading...

More Telugu News