Prime Minister: పౌరసత్వ సవరణ చట్టంతో ఎలాంటి నష్టం లేదు.. వదంతులు నమ్మొద్దు: ప్రధాని మోదీ విజ్ఞప్తి

  • భారతీయులెవరూ ఆందోళన చెందక్కర్లేదు
  • శాంతి, ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని కాపాడాల్సిన సమయమిది
  • స్వార్థపరుల ఆటలు సాగనివ్వబోం

జాతీయ పౌరసత్వ సవరణ చట్టంపై ఈశాన్య రాష్ట్రాలు సహా పలుచోట్ల పలువురు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో విద్యార్థులు నిన్న ఆందోళనకు దిగారు. హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ స్పందించారు. ఈ ఘటనలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని అన్నారు. దేశాభివృద్ధే లక్ష్యంగా అందరం కలిసి పనిచేయాలని, భారతీయులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

ప్రజాస్వామ్యంలో ఏ సమస్యకైనా చర్చలే పరిష్కారమని, ఆస్తులను ధ్వంసం చేయడం, ప్రజాజీవితానికి ఆటంకాలు కలిగించడం సబబు కాదని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం శతాబ్దాల భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందని, ఈ చట్టం మతసామరస్యం, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. ఏ ప్రాంతానికి చెందిన పౌరుడికీ ఈ చట్ట సవరణ ద్వారా ఎలాంటి నష్టం జరగబోదని మరోమారు స్పష్టం చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే స్వార్థపరుల ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు. శాంతి, ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని కాపాడాల్సిన సమయమిదని, ఎలాంటి వదంతులు నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని ప్రధాని అన్నారు.

  • Loading...

More Telugu News