Indian army: భారత తదుపరి సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్!
- ప్రస్తుత చీఫ్ రావత్ ఈ నెల 31న పదవీ విరమణ
- ప్రస్తుతం ఆర్మీ వైస్ చీఫ్‌గా మనోజ్ నరవానే
- పదవీ విరమణ అనంతరం డిఫెన్స్ స్టాఫ్ చీఫ్‌గా రావత్?
భారత ఆర్మీ నూతన చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే నియమితులు కానున్నారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మనోజ్ ముకుంద్ కొత్త చీఫ్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రస్తుతం ఆయన ఆర్మీ వైస్ చీఫ్‌గా పనిచేస్తున్నారు. మనోజ్‌కు ఆర్మీలో విశేష అనుభవం ఉంది. బిపిన్ రావత్ తర్వాత ఆర్మీలో అత్యంత సీనియర్ ఆయనే. జమ్మూకశ్మీర్‌లోని రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్‌కు నాయకత్వం వహించారు. మయన్మార్‌లో మూడేళ్లపాటు భారత రాయబార కార్యాలయంతో కలిసి పనిచేశారు. ఆయన తన సేవలకు గాను ‘విశిష్ట సేవా అవార్డ్, ‘అతి విశిష్ట సేవా మెడల్’ అందుకున్నారు. కాగా, పదవీ విరమణ అనంతరం బిపిన్ రావత్ డిఫెన్స్ స్టాఫ్ చీఫ్‌గా పనిచేసే అవకాశం ఉందని సమాచారం.