CAA: విద్యార్థులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్న సినీ ప్రముఖులు
- నిరసన గళాన్ని ప్రభుత్వం నొక్కేయాలని చూస్తోంది
- విద్యార్థులకు మేం అండగా ఉంటాం
- నిరసనల్లో హింసకు తావివ్వొద్దు
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గళమెత్తిన ఢిల్లీ జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసుల దాడిని బాలీవుడ్ సినీ ప్రముఖులు ఖండించారు. ఈ చట్టంపై నిరసన తెలిపే హక్కు లేకుండా ప్రభుత్వం నిరసన గళాలను అణచివేస్తోందని నటి తాప్పీ, నటి, దర్శకురాలు కొంకణాసేన్, దర్శకులు అనురాగ్ కాశ్యప్, సుధీర్ మిశ్రాలు విమర్శించారు. దేశంలో వస్తున్న కొత్త నిబంధనల్లో ఇమడలేని వారికే వాటి పరిణామాలు బాగా తెలుస్తాయన్నారు. విద్యార్థులకు తాము అండగా ఉంటామని మద్దతు పలికారు. పౌరసత్వ సవరణ చట్టంపై జరుగుతున్న ఆందోళనల్లో హింసకు వీలు కల్పించొద్దని బెంగాలీ ప్రముఖ నటుడు సౌమిత్ర ఛటర్జీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.