Kodandarami Reddy: ఆయన ఆఫీసు మెట్లెక్కిన దర్శకుల దశ తిరిగిపోతుందనే సెంటిమెంట్ వుండేది: కోదండరామిరెడ్డి

  • నా తొలి సినిమా 'సంధ్య'
  • తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాను 
  •  రెండవ సినిమా 175 రోజులు ఆడిందన్న కోదండరామిరెడ్డి  

దర్శకుడిగా అనేక విజయాలను అందుకున్న ఎ.కోదండరామిరెడ్డి, తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి ప్రస్తావించారు. "అసిస్టెంట్ డైరెక్టర్ గా .. కో డైరెక్టర్ గా పదేళ్లపాటు పనిచేశాను. ఇక దర్శకుడిగా అవకాశాల కోసం ట్రై చేయడం మొదలెట్టాను. అలా మొదట సుజాత ప్రధాన పాత్రధారిగా 'సంధ్య' సినిమా చేసే అవకాశం లభించింది. కేవలం 22 రోజుల్లోనే తీసిన ఆ సినిమా భారీ విజయాన్ని సాధించింది.

ఆ వెంటనే నిర్మాత క్రాంతికుమార్ గారు పిలిపించి, 'న్యాయం కావాలి' సినిమా చేసి పెట్టమన్నారు. ఆయన బ్యానర్లో అంత తొందరగా అవకాశం రావడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఆయన ఆఫీస్ పైఅంతస్తులో ఉండేది .. పైకి వెళ్లడానికి 39 మెట్లు ఉండేవి. ఆ మెట్లెక్కిన దర్శకులు అగ్రస్థాయికి చేరుకుంటారనే సెంటిమెంట్ అప్పటికే బలంగా వుండేది. దాంతో నేను కూడా దర్శకుడిగా బిజీ అవుతాననే నమ్మకం కలిగింది. చిరంజీవి - రాధిక చేసిన 'న్యాయం కావాలి' సినిమా 175 రోజులు ఆడటంతో, నాకు మంచి పేరు వచ్చింది" అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News