Sensex: అమెరికా, చైనా ఎఫెక్ట్.. దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు
- అమెరికా, చైనాల మధ్య తగ్గుతున్న వాణిజ్య యుద్ధ తీవ్రత
- 413 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 111 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఎనర్జీ, హెల్త్ కేర్, రియాల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సూచీలు మినహా మిగిలిన అన్ని సూచీలు లాభపడ్డాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు లాభాల్లోనే పయనించాయి. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధ తీవ్రత సడలుతున్న నేపథ్యంలో, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 413 పాయింట్లు లాభపడి 41,352కి పెరిగింది. నిఫ్టీ 111 పాయింట్లు లాభపడి 12,165కు చేరుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (4.73%), భారతీ ఎయిర్ టెల్ (4.37%), వేదాంత లిమిటెడ్ (3.26%), టాటా మోటార్స్ (3.03%), బజాజ్ ఫైనాన్స్ (2.56%).
టాప్ లూజర్స్:
సన్ ఫార్మా (-1.17%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.60%), బజాజ్ ఆటో (-0.56%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.35%), యాక్సిస్ బ్యాంక్ (-0.24%).