Amaravathi: రాష్ట్ర విభజనతో కన్నా చంద్రబాబు సీఎంగా ఉండటం వల్లే ఎక్కువ నష్టం జరిగింది: మంత్రి బొత్స

  • గతంలో సింగపూర్ తో ఎంఓయూలు లోపభూయిష్టం
  • ఆ ఒప్పందాల వెనుక స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి
  • చంద్రబాబునాయుడు చేసింది తప్పు

రాష్ట్ర విభజనతో కన్నా ఏపీకి ఐదేళ్లుగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. తన హయాంలో రాజధాని అభివృద్ధికి సింగపూర్ తో స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో కుదుర్చుకున్న ఒప్పందం గురించి చంద్రబాబు వివరించి చెబుతున్న సమయంలో వైసీపీ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి బొత్స స్పందిస్తూ, గతంలో ఎంఓయూలు కుదుర్చుకున్న సింగపూర్ ప్రతినిధులు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు మూడుసార్లు తమను కలిశారని చెప్పారు. గతంలో కుదర్చుకున్న ఎంఓయూలను ఏ విధంగా సాధిస్తారన్న విషయాన్ని వివరించి చెప్పమని ఆ ప్రతినిధులను తాము కోరామని, మళ్లీ వస్తామని చెప్పి వెళ్లారు తప్ప దీనిపై స్పష్టత ఇవ్వలేదని చెప్పారు.

చంద్రబాబునాయుడు చేసింది తప్పు, వాటిని సమర్థించుకోవడానికి డొంక తిరుగుడు ధోరణిలో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ‘స్విస్ ఛాలెంజ్’ పద్ధతి మన దేశంలో వద్దని సుప్రీంకోర్టు కూడా ఆక్షేపించిందని గుర్తుచేశారు. సింగపూర్ తో కుదుర్చుకున్నది ‘జీ టూ జీ’ ఒప్పందం అని ఓసారి, ‘స్విస్ ఛాలెంజ్’ పద్ధతి అని మరోసారి అంటూ ఏదేదో చంద్రబాబు చెబుతున్నారని, ఆ ఒప్పందాల వెనుక స్వార్థ ప్రయోజనాలు విమర్శించారు.

  • Loading...

More Telugu News