Ap Mahila commission: వాళ్ల కోసం అర్ధరాత్రి కూడా పని చేసే సుప్రీంకోర్టు.. ఆ మహిళల కోసం ఎందుకు పనిచేయదు?: వాసిరెడ్డి పద్మ

  • మహిళల భద్రతకు దేశంలో చట్టాలు మరింత కఠినతరం చేయాలి
  • ‘ఏపీ దిశ’ తరహా చట్టాలు అన్ని రాష్ట్రాల్లో తీసుకురావాలి
  • దిశ ఘటనలో టీ- పోలీస్ చర్యను అభినందిస్తున్నా

రాజకీయపార్టీలు, నేతల కోసం అర్ధరాత్రి కూడా పని చేసే సుప్రీంకోర్టు, అకృత్యాలకు గురైన మహిళల కోసం ఎందుకు తెరచుకోవడం లేదని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ఢిల్లీలో ఈరోజు నిర్వహించిన జాతీయ మహిళా కమిషన్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దారుణాలను నివారించేందుకు ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల తీసుకొచ్చిన ‘ఏపీ దిశ’ తరహా చట్టాలు అన్ని రాష్ట్రాల్లో తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. మహిళల భద్రత విషయమై దేశంలో చట్టాలను మరింత కఠినతరం చేయాలని కోరారు. దిశ ఘటనలో తెలంగాణ పోలీస్ చర్యను ఆమె అభినందించారు. మహిళలపై జరుగుతున్న నేరాలు ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలపై విజయవాడలో వచ్చే నెలలో సదస్సు నిర్వహించనున్నట్టు చెప్పారు. జనవరి 6,7 తేదీలలో ఈ సదస్సు జరుగుతుందని వివరించారు.

  • Loading...

More Telugu News