laxmi narayana: సీఎం జగన్ చేసిన రాజధానుల ప్రకటనపై బీజేపీ డిమాండ్ ఇదే!: కన్నా లక్ష్మీనారాయణ
- రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండొచ్చన్న జగన్ ప్రకటనపై స్పందన
- అభివృద్ధి వికేంద్రీకరణ చెయ్యాలి
- అంతేగానీ పరిపాలన వికేంద్రీకరణ కాదు
రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండొచ్చని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ చేసిన ప్రకటనపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. దీనిపై తాజాగా ఆయన ఓ డిమాండ్ ను ప్రభుత్వం ముందు ఉంచారు. అభివృద్ధి వికేంద్రీకరణ చెయ్యాలి గానీ, పరిపాలన వికేంద్రీకరణ కాదంటూ ఆయన ట్వీట్ చేశారు.
'అమరావతి సీడ్ క్యాపిటల్లో పూర్తి శాసన, పరిపాలన వ్యవస్థ, హైకోర్టు బెంచ్.. విశాఖ ఆర్థిక రాజధానిగా ఎదగడానికి కావాల్సిన ప్రోత్సాహకాలు.. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ చెయ్యాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది' అని కన్నా లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు.