nirbhaya: 'నిర్భయ' దోషి అక్షయ్ పిటిషన్ తిరస్కరణ.. ఉరిశిక్షను ధ్రువీకరించిన సుప్రీంకోర్టు
- తీర్పు పునఃపరిశీలనకు ఎలాంటి ఆధారాలు లేవు
- స్పష్టం చేసిన త్రిసభ్య ధర్మాసనం
- త్వరలోనే దోషులకు ఉరి?
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'నిర్భయ' హత్యాచారం కేసులో నలుగురు దోషుల్లో ఒకరైన అక్షయ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. అతడికి వేసిన ఉరిశిక్షను ధ్రువీకరించింది. తీర్పు పునఃపరిశీలనకు ఎలాంటి ఆధారాలు లేవని జస్టిస్ ఆర్.భానుమతి, అశోక్ భూషణ్, బోపన్నలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.
ఢిల్లీలో వాయు కాలుష్యం వల్ల ఎలాగో తన ఆయుష్షు తగ్గిపోతుందని అలాంటప్పుడు ఇంక మరణశిక్ష ఎందుకని అక్షయ్ తన పిటిషన్ లో పేర్కొన్న విషయం తెలిసిందే. తనకు వేసిన మరణశిక్ష తీర్పును పున:సమీక్షించాలని అక్షయ్ తన పిటిషన్లో కోరాడు. అతడి రివ్యూ పిటిషన్ పై ఇంప్లీడ్ అయ్యేందుకు సుప్రీంకోర్టులో 'నిర్భయ' తల్లి కూడా పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు నిర్ణయంతో నిర్భయ దోషులకు త్వరలోనే ఉరి శిక్ష అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.