Andhra Pradesh: మూడు రాజధానులు ఉండొచ్చని మాత్రమే సీఎం జగన్ అన్నారు: మంత్రి పేర్ని నాని
- ‘ఉండొచ్చు’కు..‘ఉంటుంది’ అనే మాటకు తేడా ఉంది
- ప్రతిపక్షాలకు జగన్ పై ఎంత ద్వేషమో అర్థమౌతోంది
- రాజధానిపై చర్చకు చంద్రబాబు భయపడుతున్నారు
ఏపీకి మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా మారింది. సీఎం జగన్ నిన్న చేసిన వ్యాఖ్యలపై రాజకీయ నేతల నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి. ముఖ్యంగా, టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై మంత్రి పేర్ని నాని స్పందిస్తూ, విశాఖ, అమరావతి, కర్నూలులో మూడు రాజధానులు ఉండొచ్చని మాత్రమే జగన్ అన్నారని, ‘ఉండొచ్చు’ అనే మాటకు..‘ఉంటుంది’ అనే మాటకు చాలా తేడా ఉందని చెప్పారు. ప్రతిపక్షాలు చేసే విమర్శలు చూస్తుంటే జగన్ పై వారికి ఎంత ద్వేషం ఉందో అర్ధమౌతుందని అన్నారు. రాజధానిపై చర్చ జరిగితే టీడీపీ నేతలను దుస్తులు లేకుండా ప్రపంచానికి చూపిస్తామని చంద్రబాబు భయపడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.