Andhra Pradesh: ఆస్తులు, భూములు పోతాయనేదే టీడీపీ నేతల భయం: మంత్రి కన్నబాబు
- సీఎం స్పష్టమైన వైఖరి వెలిబుచ్చారన్న కన్నబాబు
- జగన్ టీడీపీ తప్పులను సరిదిద్దే పనిలో ఉన్నారని వ్యాఖ్యలు
- పవన్ పైనా విమర్శలు
ఏపీ రాజధానిపై సీఎం జగన్ స్పష్టమైన వైఖరి వెల్లడించారని, ఆస్తులు, భూములు పోతాయన్న భయంతోనే టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. టీడీపీ హయాంలో ఏ జిల్లాకైనా చెప్పుకోదగిన ప్రాజెక్టు ఒక్కటైనా తీసుకువచ్చారా? అని నిలదీశారు. గత ఐదేళ్లలో టీడీపీ చేసిన తప్పులను సరిదిద్దే పనిలో సీఎం జగన్ ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్ పైనా కన్నబాబు స్పందించారు. ఒకే ప్రాంతాన్ని అభివృద్ది చేయాలనా మీ ఉద్దేశం? అభివృద్ది వికేంద్రీకరణ జరిగితే తప్పేంటి? మీకెందుకు అంత ఆందోళన? అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.