Nirbhaya: 'నిర్భయ' దోషులపై సుప్రీం తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేసిన యడ్డీ
- దోషి అక్షయ్ కుమార్ పెట్టుకున్న రివ్యూ పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు
- సుప్రీం నిర్ణయం కిరాతకులకు గుణపాఠం కావాలన్న సీఎం
- స్వాగతించిన మాజీ ముఖ్యమంత్రులు
నిర్భయ దోషుల క్షమాభిక్ష పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చడాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప స్వాగతించారు. అత్యున్నత ధర్మాసనం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. దోషులకు ఉరిశిక్ష తప్పదని అన్నారు. మహిళలపై హత్యాచారాలకు పాల్పడుతున్న కిరాతకులకు సుప్రీం నిర్ణయం గుణపాఠం కావాలన్నారు. నిర్బయ దోషుల క్షమాభిక్షను సుప్రీంకోర్టు తోసిపుచ్చడంపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు హెచ్‌డీ కుమారస్వామి, సిద్ధరామయ్యలు కూడా హర్షం వ్యక్తం చేశారు.
కాగా, నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన నలుగురు దోషుల్లో ఒకడైన అక్షయ్ కుమార్ సింగ్(33) రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు బుధవారం తోసిపుచ్చింది. దోషులు నలుగురికి మరణశిక్ష విధిస్తూ 2017లో చెప్పిన తీర్పును మార్చాల్సిన అవసరం కనిపించలేదని జస్టిస్ ఆర్.భానుమతి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.