Karnataka: బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రయోగం: కూడళ్లలో మానెక్విన్ల ఏర్పాటు

  • కానిస్టేబుల్ బొమ్మలు పర్యవేక్షణ 
  • బొమ్మే కదా అని నిర్లక్ష్యం చేస్తే అంతే సంగతులు 
  • అందులోని కెమెరాలు మిమ్మల్ని పట్టుకుంటాయి.

ఉల్లంఘనులైన వాహన చోదకులను నియంత్రించేందుకు బెంగళూరు పోలీసులు వినూత్న ప్రయోగం మొదలు పెట్టారు. ముఖ్యమైన ట్రాఫిక్ కూడళ్లలో మానెక్విన్ (ట్రాఫిక్ పోలీసుల బొమ్మలు)లు ఏర్పాటుచేసి కంట కనిపెడుతున్నారు. బొమ్మే కదా అని వాహన చోదకులు తేలికగా తీసుకుంటే అంతే సంగతులు. సాధారణంగా దుకాణాల్లో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఇలాంటి బొమ్మలు ఏర్పాటు చేస్తుంటారు.

నగరంలోని ముఖ్యమైన జంక్షన్లలో పోలీసులు ఏర్పాటు చేసిన ఈ బొమ్మల్లోని సీసీ కెమెరాలు అనుక్షణం వాహన చోదకులపై నిఘా వేసి ఉంచుతాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే ఆటోమేటిక్ గా ఈ కెమెరాలు దాన్ని నమోదు చేసి సదరు వాహన చోదకుని అడ్రస్ కు జరిమానా స్లిప్ చేరుతుంది.

తొలిరోజులో ఈ బొమ్మలను తేలికగా తీసుకున్న వాహన చోదకులు చేతికి జరిమానా  స్లిప్ లు అందేసరికి కంగుతింటున్నారు. దీంతో ఇప్పుడు ఏ జంక్షన్లోనైనా ట్రాఫిక్ పోలీసు బొమ్మ కనిపిస్తే చాలు...పోలీసులను చూసిన దానికంటే ఎక్కువగా భయపడుతున్నారు.

నిబంధనలకు లోబడి నడుచుకుంటున్నారు. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో బెంగళూరు పోలీసులు ముఖ్యమైన అన్ని కూడళ్లలోనూ ట్రాఫిక్ పోలీసు బొమ్మలు ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు.

  • Loading...

More Telugu News