samata: పోలీసులు మాపై తప్పుడు కేసులు నమోదు చేశారు: కోర్టులో 'సమత' అత్యాచార నిందితుల ఆరోపణలు
- ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ ప్రారంభం
- నేరాన్ని అంగీకరించని సమత కేసు నిందితులు
- నిందితులతో మాట్లాడేందుకు న్యాయవాదికి అనుమతించిన కోర్టు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కలకలం రేపిన 'సమత' హత్యాచారం కేసులో ఆదిలాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ ప్రారంభమైంది. నిందితులు షేక్ బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ ముగ్దుంలను కోర్టు విచారించింది. వారు ఈ నేరాన్ని అంగీకరించలేదు. పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారని కోర్టుకు తెలిపారు.
నిందితుల తరఫున న్యాయవాది రహీం కోర్టులో డిశ్చార్జి పిటిషన్ వేశారు. నిందితులతో మాట్లాడేందుకు న్యాయవాదికి న్యాయస్థానం అనుమతించింది. అనంతరం ఈ కేసును రేపటికి వాయిదా వేసింది. కాగా, లింగాపూర్ మండలం ఎల్లపటార్లో సమతపై కొందరు మృగాళ్లు అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే.