Ashok Babu: మూడు మాత్రమే ఎందుకు? ఐదు రాజధానులు పెట్టండి: అశోక్ బాబు చురక
- రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తీసుకురాలేకపోతున్నారు
- అందుకే రాజధాని వికేంద్రీకరణ అంటున్నారన్న అశోక్ బాబు
- ప్రకటనను వెనక్కి తీసుకోవాలని బచ్చుల అర్జునుడు డిమాండ్
ఏపీకి మూడు రాజధానులు ఉండవచ్చంటూ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ సందర్భంగా టీడీపీ నేత అశోక్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఏపీకి మూడు రాజధానులు అనేది జగన్ ఆలోచన మాత్రమేనని మంత్రులు చెబుతున్నారని అన్నారు.
రాజధాని మూడు చోట్ల ఎందుకు? ఐదు చోట్ల పెట్టండి అని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తీసుకురాలేకపోతున్నారని... అందుకే, రాజధాని వికేంద్రీకరణ అంటున్నారని చెప్పారు. మరో టీడీపీ నేత బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ, అనాలోచిత ప్రకటనను జగన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.