Andhra Pradesh: ఏపీకి ఆర్థిక సాయం పెంచాలని.. ఆర్థిక సంఘం చైర్మన్ ను కోరిన సీఎం జగన్
- 15వ ఆర్థిక సంఘం చైర్మన్ తో సీఎం భేటీ
- రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయామన్న జగన్
- రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతల గురించి వివరణ
ఏపీకి ఆర్థిక సాయం పెంచాలని 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్ కే సింగ్ ను సీఎం జగన్ కోరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఎన్ కే సింగ్ నేతృత్వంలోని బృందంతో ఈరోజు భేటీ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి తగు సాయం చేయాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు, వివిధ రంగాల్లో తీసుకొచ్చిన మార్పులు పలు అంశాల గురించి ఆర్థిక సంఘానికి వివరించారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రకటించిన ప్రత్యేక హోదా హామీ గురించీ జగన్ ప్రస్తావించినట్టు సమాచారం. ఈ హామీ ఇప్పటికీ నెరవేరలేదన్న విషయాన్ని ఆర్థిక సంఘం దృష్టికి తెచ్చారు. రాష్ట్ర విభజన కారణంగా తీవ్రంగా నష్టపోయామని, పారిశ్రామిక, సేవారంగాల్లో వృద్ధి లేదని ఆర్థిక బృందం సభ్యులతో చెప్పినట్టు సమాచారం.