Gopireddy Srinivas Reddy: అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఒకే చోట ఉంటే బాగుంటుంది.. సీఎంతో మాట్లాడతా!: వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి

  • రాజధానిపై తన అభిప్రాయాన్ని వెల్లడించిన గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
  • అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఒకే చోట ఉండాలి
  • విశాఖను ఆర్థిక రాజధానిగా చేయాలి

ఏపీకి మూడు రాజధానులు వస్తాయేమోనంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. అటు విపక్షమైన టీడీపీతో పాటు, ఇటు అధికారపక్షం వైసీపీలో కూడా ఈ అంశంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ప్రాంతాల వారీగా నేతలు తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో, గందరగోళ పరిస్థితి నెలకొంది.

తాజాగా నర్సరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఒకే చోట ఉంటే బాగుంటుందని తన మనసులోని మాటను వెల్లడించారు. విశాఖను ఆర్థిక రాజధానిగా చేయాలనేదే తన అభిప్రాయమని చెప్పారు. ఇదే విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళతానని అన్నారు.

  • Loading...

More Telugu News