Jarkhand: జార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్.. బీజేపీకి ఎదురుదెబ్బ!
- ముగిసిన జార్ఖండ్ ఎన్నికల చివరి దశ పోలింగ్
- 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటు వేసిన ఓటర్లు
- వచ్చే నెల 5తో ముగియనున్న రాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం
జార్ఖండ్ ఎన్నికల చివరి దశ పోలింగ్ ఈరోజు సాయంత్రంతో ముగిసింది. అనంతరం, ఎన్నికల ఫలితాలపై ఇండియా టుడే, టైమ్స్ నౌ కషిప్ సంస్థలు తమ సర్వే వివరాలను వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో బీజేపీకి చుక్కెదురైంది. కాంగ్రెస్, జేఎంఎంకే పట్టం కట్టారు.
ఇండియాటుడే: బీజేపీ- 22-32, జేఎంఎం + కాంగ్రెస్ : 38-50
టైమ్స్ నౌ కషిప్: బీజేపీ- 28, జేఎంఎం + కాంగ్రెస్- 44
కాగా, జార్ఖండ్ ఎన్నికల పోలింగ్ మొత్తం ఐదు దశల్లో జరిగింది. చివరిదశ పోలింగ్ ఈరోజు జరిగింది. 16 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వచ్చే నెల 5తో రాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం ముగియనుంది.