BJP: సీఏఏపై అపోహలు తొలగించేందుకు.. వెయ్యి ర్యాలీలు, 250 సమావేశాలు!
- సీఏఏపై కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తోంది
- వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొడతాం
- బీజేపీ ప్రధాన కార్యదర్శి భూపేందర్
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్న వేళ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. సీఏఏపై వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టడంతోపాటు ఈ చట్టంపై ప్రజల్లో నెలకొన్న అపోహలను నివృత్తి చేసేందుకు నడుంబిగించింది. దేశవ్యాప్తంగా వెయ్యి ర్యాలీలు, 250 మీడియా సమావేశాలు నిర్వహించాలని యోచిస్తోంది.
ఈ ర్యాలీలు, మీడియా సమావేశాల్లో సీఏఏపై ప్రజల్లో నెలకొన్న అపోహలను నివృత్తి చేస్తామని, ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను దూరం చేస్తామని బీజేపీ ప్రధాన కార్యదర్శి భూపేందర్ తెలిపారు. సీఏఏపై కాంగ్రెస్ సహా కొన్ని పార్టీలు అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని, దేశంలో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని భూపేందర్ ఆరోపించారు. వాటి కుయుక్తులను ఎండగడతామని చెప్పారు.