Brij Fi: ఇంటర్నెట్ ఆగిపోగా, మాస్టర్ ప్లాన్ వేసిన నిరసనకారులు... బ్రిజ్ ఫై గురించి తెలుసుకోండి!

  • బ్లూటూత్ సాయంతో మెసేజ్ ల బట్వాడా
  • 65 రెట్లు పెరిగిన యాక్టివ్ యూజర్స్ సంఖ్య
  • ట్విట్టర్ లో ట్రెండింగ్ అవుతున్న బ్రిజ్ ఫై

బ్రిజ్ ఫై, ఫైర్ చాట్... ఇవి రెండూ ఇప్పుడు ఇండియాలో హాట్ టాపిక్. ఈ యాప్స్ డౌన్ లోడ్ చేసుకుంటున్న వారి సంఖ్య 80 శాతం పెరుగగా, యాక్టివ్ యూజర్స్ సంఖ్య ఏకంగా 65 రెట్లకు చేరుకుంది. ట్విట్టర్ పేజీలో ఇండియాలో బ్రిజ్ ఫై తెగ ట్రెండింగ్ అవుతోంది. రోజుకు సరాసరిన 2,600కు పైగా డౌన్ లోడ్స్ నమోదవుతున్నాయి. ఇంతకీ ఇవి ఏంటంటారా?

ఏ విధమైన ఇంటర్నెట్ లేని సమయాల్లో బ్లూటూత్ ను ఉపయోగించుకుని, తక్కువ దూరం పరిధిలో మెసేజ్ లు పంపుకోవడం, అందుకోవడం చేయవచ్చు. చైనాకు వ్యతిరేకంగా నిరసనకారులు ఆందోళనలు చేపట్టిన వేళ, అక్కడ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయగా, ఈ రెండు యాప్స్ వినియోగం పెరిగిపోయింది.

తాజాగా, ఇండియాలో పౌరసత్వ సవరణ చట్టానికి పార్లమెంట్ ఓకే చెప్పిన తరువాత, పలు రాష్ట్రాల్లో నిరసనలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం పలు చోట్ల ఇంటర్నెట్ సేవలను ఆపివేయించిన సంగతి తెలిసిందే. దీంతో నిరసనకారులు బ్రిజ్‌ ఫై, ఫైర్ చాట్‌ లను ఆశ్రయించారు. హాంకాంగ్ నిరసనకారుల దారిలో నడుస్తూ, సమాచారాన్ని బట్వాడా చేసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News